NRML: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కులగణనలో నమోదు చేసేటప్పుడు నాయక్, నాయక, నాయకపు అని కాకుండా నాయకపోడ్ అని నమోదు చేసుకోవాలని ఆదివాసి నాయకపోడ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంక గారి భూమయ్య కోరారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. అప్పటి నిజాం పాలనలో 1950లో నాయక పోడులను తీసుకువచ్చి గోండు తెగలలో కలిపి మా తెగకు అన్యాయం చేశారని అన్నారు.