VSP: జీకేవీధి మండలం సిగనాపల్లి రంగురాళ్ల క్వారీ వద్ద తవ్వకాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పెదవలస అటవీ రేంజ్ అధికారిణి శివరంజని తెలిపారు. ఇందులో భాగంగా క్వారీ వద్ద 24 గంటలు గస్తీ ఏర్పాటు చేశామన్నారు. రాత్రి వేళల్లో అటవీశాఖ, బేస్ క్యాంపు, టాస్క్ఫోర్స్ సిబ్బంది క్వారీ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తున్నారని అన్నారు.