»Farmers Rail Roko Protest On 2023 February 22 Gurdaspur
Rail Roko: ఫిబ్రవరి 22న రైతుల రైల్ రోకో నిరసన
కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఫిబ్రవరి 22న అమృత్‌సర్‌లోని గురుదాస్‌పూర్‌లో 'రైల్ రోకో' నిరసనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది రైతులు పాల్గొననున్నట్లు ప్రకటించింది. భారతమాల యోజన కింద హైవే నిర్మాణం కోసం సేకరించిన భూమికి సమానమైన పరిహారం చెల్లించడం, చెరకు బకాయిలు, ఢిల్లీ ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుబాలకు పరిహారం, ఉద్యోగాలు సహా పలు అంశాలపై రైతులు నిరసన చేపట్టనున్నారు.
రైతులు(Farmers)ఫిబ్రవరి 22న అమృత్‌సర్‌లోని గురుదాస్‌పూర్(gurdaspur)లో ‘రైల్‌రోకో(Rail Roko)’ నిర్వహించనున్నారు. భారతమాల యోజన కింద హైవే నిర్మాణం కోసం సేకరించిన భూమికి సమానమైన పరిహారం చెల్లించడం సహా చెరకు బకాయిలు చెల్లించడం లేదని డిమాండ్లు ఉన్నాయి. దీనికితోడు ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం, ఉద్యోగాలు కల్పించడం వంటివి ఇంకా పెండిగ్‌లోనే ఉన్నాయని అన్నదాతలు చెబుతున్నారు.
ఈ క్రమంలో పంజాబ్‌లోని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ(kisan mazdoor sangharsh committee) ‘రైల్ రోకో’ నిరసన కోసం సోమవారం అమృత్సర్ జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ఫిబ్రవరి 22న ట్రాక్టర్లు నడుపుతూ రైల్ రోకోలో వేలాది మంది రైతులు పాల్గొంటారని కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. అందుకోసం సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం భూసేకరణ చేస్తోందని, విషాదం ఏంటంటే నిరుపేద రైతులు ఇప్పుడు తమ భూముల కోసం ధర్నాలు చేసి డబ్బులు వసూలు చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు జనవరి 29, 30 తేదీల్లో జరిగిన నిరసన కవాతులో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని పంధేర్ ఆరోపించారు. ఇప్పటి వరకు డిమాండ్లు(demands) ఏవీ నెరవేర్చలేదని గుర్తు చేశారు. ఈ క్రమంలో ప్రజల హక్కుల కోసం నిరసన తెలిపాలని తమ సంఘం నిర్ణయించుకుందన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి భగవంత్ మాన్(bhagwant mann) ప్రభుత్వం అడ్డుగా ఉందని ఆయన ఆరోపించారు. అనేక మార్లు పట్టించుకోలేదని రైతులు(Farmers) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.