ఇజ్రాయెల్ అణుశాస్త్రవేత్తల వివరాలను ఇరాన్‌కు చేరవేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌లోని బెనియి బ్రాక్లోని ఇటీవల అరెస్ట్ చేసిన ఓ జంట టెహ్రాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఓ అణుశాస్త్రవేత్త ఇల్లు, కారును వీడియో తీయడానికి నిందితుల్లో ఒకరు గోప్రో కెమెరాను వాడినట్లు ఇజ్రాయెల్ బృందాలు గుర్తించినట్లు తెలిసింది.