రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ ప్రతిష్టాత్మక మూవీ 2026, జూన్ 4న విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ను ఈనెల 8 నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను హిందీలో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తుండటంతో, అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.