SKLM: శ్రీకాకుళం జిల్లా సిమెంట్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు గురువారం స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఎం సహాయ నిధికి రూ. 55వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాపవరపు సీజు, కార్యవర్గ సభ్యులు ఊన సంతోష్ కుమార్ గుప్తా, బాన్న పవన్ తదితరులు పాల్గొన్నారు.