TG: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బీసీ కమిషన్ నియమించాలని మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ప్రస్తుత కమిషన్ విద్య, ఉద్యోగాల కోసమే ఏర్పాటైందని తెలిపారు. ప్రస్తుత కమిషన్ వల్ల కులగణన చేసినా ఉపయోగం లేదన్నారు. 2 వారాల్లోగా డెడికేటెడ్ కమిషన్ నియమించాలని కోరారు. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తారన్న నమ్మకం ఉందని.. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.