మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న శక్తి పథకాన్ని పునఃసమీక్ష చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆ రాష్ట్ర CM సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కొందరు మహిళలు టికెట్ డబ్బులు చెల్లిస్తామని ట్వీట్లు, మెయిళ్లు పెడుతున్నారని డిప్యూటీ CM DK శివకుమార్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారంటూ ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే అలాంటి ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని CM తెలిపారు.