ఈ ఏడాది దేశీయ మార్కెట్లో IPOల హవా కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా తొలి పబ్లిక్ ఆఫర్ల ద్వారా పెద్ద మొత్తంలో నిధులు సమీకరించేందుకు పలు సంస్థలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యాయి. మరికొన్ని దలాల్ స్ట్రీట్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా ఈ ఏడాదిలో స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన IPOలు చరిత్ర సృష్టించాయి. 2024 ముగియడానికి ఇంకా 2నెలల ముందే సరికొత్త రికార్డును నెలకొల్పాయి.