TG: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగను తెలంగాణ ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని కోరారు. మరోవైపు మాజీమంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లు దూరమై జీవితంలో వెలుగులు నింపే పండుగ దీపావళి అని అన్నారు. మహాలక్ష్మీ అనుగ్రహంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు.