AP: TTD బోర్డు ఛైర్మన్గా TV5 ఛైర్మన్ BR నాయుడిని ప్రభుత్వం నియమించింది. ఈ బోర్డులో ముగ్గురు TDP MLAలకు, ఐదుగురు తెలంగాణకు చెందిన వ్యక్తులకు, మరో ముగ్గురు కర్ణాటకకు చెందిన వారికి చోటు కల్పించింది. TTD సభ్యులుగా మొత్తం 24 మందిని నియమించింది. సభ్యులుగా MS రాజు, జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, పనబాక లక్ష్మీ, నర్సిరెడ్డి, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణామూర్తి, HL దత్, జానకిదేవి తదితరులు ఉన్నారు.