NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని గుండంపల్లి, దిలావర్పూర్ గ్రామాల శివారులో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా బుధవారం జేఏసీ నాయకులు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే ఆపాలి.. ఫ్యాక్టరీని వేరే చోటుకు తరలించాలని, లేకపోతే దీక్ష తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.