ATP: ఖరీఫ్‌లో అతివృష్టి, అనావృష్టితో సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, జిల్లాలోని అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. ఏడు మండలాలను కరవు మండలాలుగా ప్రకటించడంపై జిల్లా ప్రతినిధులు స్పందించాలన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని కోరారు.