ADB: ఏజెన్సీ ప్రాంతంలో కల్తి ఆహారాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ప్రజ్ఞశిల్ అన్నారు. బుధవారం ఆయన ఉట్నూర్లో మాట్లాడుతూ.. ఏజెన్సీలోని చాల హోటళ్లలో అమ్మే ఆహారాల్లో కల్తి జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి ఏజెన్సీలోని హోటళ్లలో తనిఖీలు నిర్వహించాలని కోరారు.