ADB: అదిలాబాద్ మున్సిపాలిటీ కమిషనర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రాజుని బుధవారం వికలాంగులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వికలాంగులకు కేటాయించిన మున్సిపల్ దుకాణ సముదాయల కాల పరిధి ముగిసినందున, రీ టెండర్ వేయాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వికలాంగుల అధ్యక్షుడు అబ్దుల్ సలీమ్, వికలాంగుల కో ఆర్డినేటర్ సిండే ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు.