TG: తనని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని BRS ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేసి కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి రెడీ అని.. ఎక్కడికి రావాలో ఎంపీ అనిల్ యాదవ్ చెప్పాలని సవాల్ విసిరారు. రాజకీయ కక్షతో సీఎం రేవంత్ కుట్రలు చేస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.