TG: దీపావళి పండగ వేళ జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు పండగకు ముందే జీతాలు విడుదల చేసింది. ఈ మేరకు ఉద్యోగుల జీతాల చెల్లింపుకు అవసరమైన రూ.120 కోట్లును సర్కార్ విడుదల చేసింది. కాగా నవంబర్ 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు జమ కావాల్సి ఉంది. అయితే దీపావళి నేపథ్యంలో ఒకటో తారీకు కంటే ముందే జీతాలు విడుదల చేశారు.