WGL: చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన గునుగంటి శ్రీజ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైంది. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పోటీల్లో శ్రీజ ప్రతిభ కనబరిచింది. వచ్చే నెల 2,3,4 తేదీల్లో కామారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననుంది. ప్రధానోపాధ్యాయురాలు జయ, ఉపాధ్యాయులు శ్రీజను అభినందించారు.