ATP: కుందుర్పి మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం జోరుగా వర్షం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వర్షం ప్రారంభమైంది. భారీగా వర్షం కురుస్తుండటంతో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లపై, ఇళ్ల ముందు వర్షం నీరు ప్రవహిస్తోంది. పది రోజుల తర్వాత వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.