TG: IASలపై తీవ్ర ఆరోపణలు వస్తున్న తరుణంలో తాజాగా మరో ఇద్దరు IASలు నవీన్ మిట్టల్, సోమేశ్ కుమార్లపై కొండాపూర్ వాసులు EDకి ఫిర్యాదు చేశారు. ఓ కుటుంబం కొండాపూర్ మసీదు బండలో 88 ఎకరాల భూమిని బాలసాయి ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చింది. ఆ భూమిని భూపతి అసోసియేట్స్‌కు 42 ఎకరాలు ఇస్తున్నట్లు జీవో జారీ చేశారని బాధితులు ఈడీకి ఫిర్యాదు చేశారు. తమ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేశారని ఆరోపించారు.