AP: వైసీపీ అధినేత జగన్ బెయిల్ రద్దు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ‘ఈడీ ఎటాచ్ చేసింది షేర్లను కాదు.. 32 కోట్ల విలువైన కంపెనీ స్థిరాస్తిని. స్టేటస్ కో అన్నది షేర్స్ మీద కాదు. 2016లో భూములను ఈడీ అటాచ్ చేసినందువల్ల.. షేర్లు బదిలీ చేయకూడదని చెప్పడం హాస్యాస్పదం. 2019లో 100 శాతం వాటాలు బదలాయిస్తామని MoUపై సంతకం చేశారు. అప్పుడు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని?’ అని ప్రశ్నించారు.