W.G: తాడేపల్లిగూడెం జడ్పీ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బాణసంచా రిటైల్ షాపుల వద్ద బుధవారం వివాదం చోటుచేసుకుంది. ఇప్పటికే 12 మంది షాపులు ఏర్పాటు చేసుకోగా బుధవారం మరో వ్యక్తి షాపు ఏర్పాటుకు ప్రయత్నిస్తుండగా ఇతర వ్యాపారులు అడ్డుకున్నారు. తమకు అధికారులు అనుమతులు ఇచ్చారంటూ వ్యాపారులపై వాగ్వాదానికి దిగడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది.