TG: ఇటీవలి కాలంలో బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. అధికారులు చర్యలు తీసుకున్నా ఆగంతకుల నుంచి బాంబు బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన విమానాల్లో బాంబు ఉందని ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ అధికారులు డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు చేపట్టారు.