మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తోన్న సినిమా ‘విశ్వంభర’. నటి మీనాక్షి చౌదరి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుందని గతకొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించిన మీనాక్షి.. ఈ సినిమాలో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో తాను ఉన్నట్లు రూమర్స్ ఎలా వచ్చాయో అర్థం కావడం లేదని, ఏదైనా సినిమాలో నటిస్తే స్వయంగా ప్రకటిస్తానని తెలిపింది.