జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నవారు వాము తినడం లేదా వాము నీటిని తాగడం వల్ల వెంటనే మంచి ఉపశమనం దొరుకుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాము గింజల్లో ఉండే ‘థైమోల్’ రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. ఇవి క్యాల్షియం ఛానెల్ బ్లాకింగ్ చేసే శక్తిని కలిగి ఉంటాయి. కిడ్నీలు, మూత్రాశయంలోని రాళ్లు కరుగుతాయి. గ్యాస్, ఎసిడిటి సమస్యలు రాకుండా చేస్తుంది. రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది.