KRNL: ఆదోని మున్సిపాలిటీలో సోమవారం అర్బన్ మార్కెట్ ను మున్సిపల్ ఛైర్మన్ శాంత, మున్సిపల్ కమిషనర్ మోహన్ కృష్ణ ప్రారంభించారు. ఈ మార్కెట్లో ముఖ్యంగా మెప్మా సభ్యులు తయారు చేసిన వస్తువులు ప్రదర్శించారు. వారు మాట్లాడుతూ.. సమాఖ్య రిసోర్స్ పర్సన్లు, సభ్యుల జీవన ప్రమాణాలను పెంచడంలో కీలకపాత్ర పోషించాలన్నారు. సీఎంఎం జిలాన్, సీఓ నారాయణమ్మ, తదితరులు పాల్గొన్నారు.