NLR: మనుబోలు మండల కేంద్రంలోని విత్తనాల దుకాణాన్ని మండల వ్యవసాయ అధికారి ఎస్.కె జహీర్ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన విత్తనాలను ఎమ్మార్పీ ధరలకే బిల్లుతో సహా రైతులకు అందజేయాలన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పని సరిగా బిల్లులు తీసుకోవాలన్నారు. మొలకలు ఎలా వస్తాయో పరీక్షించుకుని తర్వాతే నాట్లు వేసుకోవాలన్నారు.