AP: విజయనగరం జిల్లా, గంట్యాడలో మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న చిన్నారిని మంత్రి సంధ్యారాణి పరామర్శించారు. చిన్నారి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాలిక తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని వెల్లడించారు.