HNK: హనుమకొండలోని కేయూ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ను ఏసిపి దేవేందర్ రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల వివరాలు, నేరస్తుల అరెస్టు చేసిన దర్యాప్తును స్టేషన్ సీఐ రవికుమార్ ను అడిగి తెలుసుకున్నారు. డయల్ 100 పై వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి ప్రజలకు సహాయం అందించాలని ఏసిపి పోలీస్ అధికారులకు సూచించారు.