VZM: విజయనగరం పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు 1వ పట్టణ పోలీసులు మాదక ద్రవ్యాల వినియోగంపై సోమవారం అవగాహన కల్పించారు. ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో సంకల్పం పేరిట అవగాహన సదస్సు నిర్వహించారు. యువత మత్తు పదార్ధాల వినియోగానికి దూరంగా ఉండాలని, చదువు పై దృష్టి సారించాలన్నారు. డ్రగ్స్ వినియోగం వలన జీవితాలు నాశనమవుతాయని చెప్పారు.