NZB: కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగానే చేపపిల్లల పంపిణీ చేస్తుందని NZB జిల్లా ఫిషర్ మెన్ అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 8వ తేదీ నుంచి చేపపిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభించామన్నారు. గంగపుత్రుల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బతీస్తుందని MLA ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.