KMR: దోమకొండ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బీబీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆరోగ్యం,పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశామని MLHP డా.జ్యోత్స్న తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని,ఆరోగ్యకరమైన పోషపదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. అయోడైజ్డ్ ఉప్పును మాత్రమే వాడలని అన్నారు.