TG: సచివాలయ భద్రతా సిబ్బందికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం చుట్టూ 2 కి.మీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. సిబ్బంది కదలికలు, సోషల్ మీడియాపై నిఘా ఉందన్నారు. పోలీసు అధికారులపై రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాట్సప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ కావాలని సిబ్బందిని ఆదేశించారు. తప్పు జరిగితే వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.