KMM: కారేపల్లి మండలానికి చెందిన ఉప్పు సాయిరాం అనే యువకుడు మంత్రిపై ఉన్న తన అభిమానాన్ని పచ్చబొట్టుతో చాటుకున్నాడు. ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం. ఈ సందర్భంగా ఆయన చిత్రాన్ని యువకుడు తన ఛాతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఎప్పుడూ ప్రజల శ్రేయస్సు కొరకు ఆలోచించే గొప్ప నాయకుడు మంత్రి పొంగులేటి అంటూ ఉప్పు సాయిరాం పేర్కొన్నాడు.