IPL ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబర్ 31వరకు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ముంబయి ఇండియన్స్ ఎవరిని రిటైన్ చేసుకుంటుందో అంచనా వేశాడు. హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలను ముంబయి అట్టిపెట్టుకుంటుందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అయితే, మాజీ సారథి రోహిత్ శర్మను రిటైన్ చేసుకుంటుందా? లేదా అనే ప్రశ్న మిగిలి ఉందన్నాడు.