VZM: గ్రామాల్లో చేపట్టనున్న ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులు (వెండార్ ఐడీ వర్క్స్) సర్పంచులకే అప్పగించాలని బొబ్బిలి మండలానికి చెందిన సర్పంచ్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీఓను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరంలో ఉపాధి హామీ ద్వారా జరగనున్న పనులు గ్రామ పంచాయతీల ద్వారానే చేపట్టాలన్నారు.