ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామపంచాయతీలో అఖిల భారత పశుగణన సర్వే గోడపత్రికను గ్రామ టీడీపీ నాయకులు దుద్దేల చినగాలయ్య పశు సంవర్ధక శాఖ అధికారులతో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశు పోషణ రంగంలో పలు పథకాల రూపకల్పనకు, మందులు, టీకాలు, నట్టల నివారణ మందుల లభ్యతకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని తెలిపారు.