NZB: ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ప్రైవేటు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కమల్ ఒక ప్రకటనలో కోరారు. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.