AP: వైసీపీ హయాంలో రహస్యంగా ఉంచిన జీవోలను GOIR వెబ్ పోర్టల్లో ఉంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 వరకు గోప్యంగా ఉన్న జీవోలపై సాధారణ పరిపాల శాఖ కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జీవోఐఆర్ వెబ్సైట్లో 2008 నుంచి జీవోలన్నీ ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. జీవోలు అందుబాటులో లేకపోతే సమాచార లోపం ఏర్పడుతోందని అభిప్రాయపడింది.