దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా వరుస నష్టాలు చవిచూస్తున్న సూచీలు.. ఇవాళ తిరిగి పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో.. లాభాల్లో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ఆసియా మార్కెట్లు లాభాల్లో ప్రారంభమవడంతో దేశీయ మార్కెట్ సూచీలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. కాగా, మదుపర్ల సంపద ఇవాళ ఒక్కరోజే రూ.5.7లక్షల కోట్లు పెరిగింది.