NRML: ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.