TG: దివ్యాంగులకు ప్రతినెల రూ. 6 వేలు అందించాలని భారత దివ్యాంగుల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గిద్దెల రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ను వెంటనే అమలు చేయాలన్నారు. అలాగే విద్య, ఉద్యోగాలలో దివ్యాంగుల రిజర్వేషన్ పెంచాలని, లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.