కడప ఉమేశ్ చంద్ర కల్యాణ మండపంలో పోలీసులు, సిబ్బందికి మెగా ఆరోగ్య, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం ప్రారంభించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో, పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వారి సంక్షేమమే ప్రధాన లక్ష్యమని కడప ఎస్పీ అన్నారు.