TG: కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై మాజీమంత్రి KTR మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ‘ధాన్యం కొనుగోళ్లు చేయకుండా దసరాకే కాదు, దీపావళికి కూడా రైతులను దివాలా తీయిస్తారా? రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉన్నా అధికారులు, ప్రభుత్వానికి పట్టట్లేదా. ప్రభుత్వం రాజకీయాలపై పెట్టిన దృష్టి.. ధాన్యం కొనుగోలుపై ఎందుకు పెట్టట్లేదు. ఇకనైనా రాజకీయ రాక్షస క్రీడలు మాని రైతులకు మద్దతివ్వాలి’ అని డిమాండ్ చేశారు.