పాకిస్థాన్ పురుషుల వైట్ బాల్ క్రికెట్‌కు కొత్త కోచ్‌ను PCB నియమించింది. టెస్ట్ టీమ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిలెస్పీని నియమిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్‌లకు ఆయన కోచ్‌గా వ్యవరించనున్నట్లు తెలిపింది. ప్రస్తుత కోచ్ పదవికి గ్యారీ కిరెస్టన్ రాజీనామా చేయగా ఆమోదించిన పీసీబీ ఆయన స్థానంలో గిలెస్పీని ఎంపిక చేసింది.