హైదరాబాద్ నగరంలో సెక్షన్ 163 విధింపుపై విమర్శలు వస్తున్నాయి. దీంతో పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్‌కు, దీపావళికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కొన్ని అల్లరి మూకలు సీఎం నివాసంతో పాటు సచివాలయం, డీజీపీ ఆఫీస్, రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్ చేస్తున్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని.. అందుకే చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఈ నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పారు.