AP: సొసైటీ ఫర్ ఏపీ నెట్వర్క్ (శాప్నెట్)ను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాప్నెట్ సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఉన్నత విద్యామండలికి బదిలీ చేసింది. కాగా, 2018లో శాప్నెట్ను టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ‘మన టీవీ’ ద్వారా శాప్నెట్ విద్యారంగానికి సేవలు అందించింది. అయితే ఇకపై విద్యామండలి నుంచే సమర్థంగా సేవలందించాలని సర్కార్ నిర్ణయించింది.