TG: నిన్న రాత్రి జరిగిన రేవు పార్టీలో విజయ్ మద్దూరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఆయన సంచలన విషయాలను బయట పెట్టాడు. దీపావళి సందర్భంగా రాజ్ పాకాల పార్టీ ఏర్పాటు చేశారని, అతని వద్ద నుంచే కొకైన్ తీసుకున్నట్లు.. స్టేట్మెంట్లో విజయ్ మద్దూరి వెల్లడించారు. దీంతో రాజ్ పాకాలకు కొకైన్ ఎక్కడినుంచి వచ్చిందన్నదానిపై మోకిల పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.