TG: జన్వాడలో నిర్వహించిన రేవ్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ రేవ్ పార్టీలో రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నేత భార్య ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫాంహౌజ్ యజమాని మాజీమంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలగా పోలీసులు గుర్తించారు. కాగా, ఈ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారనే పూర్తి విషయాలు త్వరలో పోలీసులు వెల్లడించనున్నారు.