TG: జన్వాడ రేవ్ పార్టీ కేసులో ఫాంహౌజ్ యజమాని, కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అతని ఇంట్లోకి వెళ్లేందుకు ఎక్సైజ్ పోలీసులు యత్నించారు. అక్కడికి భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు మధ్య తోపులాట జరిగింది, ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, వివేకనందలతో సహా పలువురు బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు.